విడుదల తేదీ : 20 జూన్ 2014 TeluguWorld.wap.sh : 2.75/5 దర్శకుడు : ప్రదీప్ మాదుగుల నిర్మాత : సన వెంకట్ రావు – ఉపేంద్ర కుమార్ గిరడ సంగీతం : వి ప్రదీప్ కుమార్ నటీనటులు : ప్రదీప్, సత్య దేవ్, ఇషా తల్వార్, మధుమిత ..
‘అద్వైతం’, ‘అమ్మపాట’ షార్ట్ ఫిల్మ్స్ తో నెటిజన్స్ ని మెప్పించిన ప్రదీప్ మాదుగుల మొదటి సారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్, సత్య దేవ్, ఇషా తల్వార్, మధుమిత హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ప్రదీప్ మ్యూజిక్ అందించాడు. నూతన దర్శకుడు, నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్టైనర్ ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..
కథ :
నవీన్(ప్రదీప్) ఒక హాన్డ్సం సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నవీన్ రోజూ తన ఆఫీసులో ఉన్న అమ్మాయిలని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఓకే ఆరోజు అదే ఆఫీసులో నవీన్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన శాలిని(ఇషా తల్వార్) చేరుతుంది. నవీన్ కి గతంలో శాలినితో ఒక చేదు అనుభవం ఉంటుంది. అందువల్ల తను ఎవరనేది చెప్పకుండా శాలినితో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.
కట్ చేస్తే ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోవాలి అనే టైంలో శాలినికి నవీన్ తన చిన్ననాటి ఫ్రెండ్ అని,తన కష్టాలని తనే కారణం అని తెలిసి బ్రేకప్ చెప్పేస్తుంది. శాలినికి – నవీన్ కి మధ్య ఉన్న గతం ఏమిటి? నవీన్ శాలినికి కలిగించిన నష్టం ఏమిటి? మళ్ళీ నవీన్ – శాలిని కలిసారా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే సెకండాఫ్ లో స్టొరీ లైన్ ని బాగా కనెక్ట్ అయ్యేలా చెప్పడం. ఆ తర్వాత చెప్పాల్సింది సత్య దేవ్ గురించి ఈ 20 ఏళ్ళ యంగ్ కుర్రాడు 40 ఏళ్ళ పాత్రలో ఎంతో ఈజ్ తో నటించాడు. తన పాత్రలో ఎంతో వైవిధ్యాన్ని చూపించాడు. ఇతని సరైన యంగ్ రోల్స్ పడితే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే నటుడవుతాడు. మధుమిత తో సత్య దేవ్ ట్రాక్ చాలా బాగుంది. సెకండాఫ్ లో అందరినీ ఆకట్టుకునే ఈ ట్రాక్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది.
ఇషా తల్వార్ చాలా అందంగా ఉంది, అలాగే ఇషా స్క్రీన్ టైం తక్కువే అయినా ఉన్నంతలో బాగా చేసింది. ఆఫీస్ లో షూట్ చేసిన కామెడీ సీన్స్, హీరో చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ తో వచ్చే సీన్స్ బాగున్నాయి. వేణు కామెడీ బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ రొటీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అయితే సెకండాఫ్ మాత్రం సెంటిమెంట్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేసాడు.
మైనస్ పాయింట్స్ :
ముందుగా చెప్పాల్సిన మైనస్ పోసాని మాడా క్యారెక్టర్. తన మాడా పాత్రతో పోసాని ప్రేక్షకులను చిరాకు పెట్టాడనే చెప్పాలి. అలాగే డైరెక్టర్ క్లైమాక్స్ లో గే కామెడీ పెట్టకుండా సింపుల్ గా ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. పైన చెప్పినట్టి ఫస్ట్ హాఫ్ చాలా సింపుల్ గా, ఓ పెద్ద చెప్పుకునే రేంజ్ లో లేదు. హెచ్ఆర్ పాత్రలో కోమల్ ఘా పాత్ర సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. వైవా హర్ష, పలువురు కమెడియన్స్ లను సరిగా ఉపయోగించుకోలేకపోయారు. సినిమాలో పెద్దగా ట్విస్ట్ లు ఏమీ లేకపోవడం వల్ల సినిమా అంతా ఊహాజనితంగా ఉంటుంది. బి, సి సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకునే మసాలా ఎలిమెంట్స్ ఏమీ లేవు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి ప్రదీప్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి హెల్ప్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. ముఖ్యంగా 1980లలో వచ్చిన సీన్స్ చాలా రియలిస్టిక్ గా షూట్ చేసారు. ఎడిటింగ్ బాగుంది. ప్రేక్షకులను బాగా నవ్వించేలా రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి.
డైరెక్టర్ ప్రదీప్ రాసుకున్న స్క్రీన్ ప్లే చేలా బాగుంది. అలాగే డైరెక్టర్ గా సత్య దేవ్ – మధుమిత మధ్య రాసుకున్న ట్రాక్ ని చాలా బాగా తీసాడు. అలాగే యంగ్ లవ్ స్టొరీని స్కూల్ కిడ్స్ బ్యాక్ డ్రాప్ లో మిక్స్ చేయడం కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
నూతన డైరెక్టర్ తీసిన ‘మైనే ప్యార్ కియా’ సినిమా ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే అనిపించినా సెకండాఫ్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో పోసాని గే కామెడీని తీసేసి కాస్త డీసెంట్ కామెడీ రాసుకొని ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. బి, సి సెంటర్ వారు ఆశించే మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా యువత, ఎ సెంటర్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి. కావున ఈ వారాంతంలో మీరు ఈ సినిమాని ట్రై చేయవచ్చు.